టీజీ ఆర్టీసీలో 99వ బస్ డిపోకు శంకుస్థాపన

58చూసినవారు
టీజీ ఆర్టీసీలో 99వ బస్ డిపోకు శంకుస్థాపన
మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజా రవాణాను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఆర్టీసీ బస్సు డిపోకు మంత్రి సీతక్క గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ములుగు ప్రజలకు పొన్నం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా రూ.4.5కోట్ల నిధులతో ఏటూరునాగారంలో శంకుస్థాపన చేయనున్న ఈ డిపో తెలంగాణలో 99వ ఆర్టీసీ డిపోగా నిలవనుంది.

సంబంధిత పోస్ట్