TG: రాష్ట్రంలో నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య తమ స్వార్థం కోసం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అన్న మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేసి అద్భుతమైన భూభారతిని తీసుకొచ్చామని చెప్పారు. 'మీ గ్రామానికే వచ్చి సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారు. ఆలి మెడలో తాళి అమ్ముకుని కోర్టుల చూట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భూభారతి తెచ్చుకున్నాం' అని వ్యాఖ్యానించారు.