రాష్ట్రంలో వడదెబ్బతో నలుగురు మృతి
By Ravinder Enkapally 67చూసినవారుTG: రాష్ట్రంలో వడదెబ్బకు నలుగురు బలయ్యారు. నల్గొండ(D) డిండి(M) సింగరాజుపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడు పొనుగోటి రామేశ్వర్‌రావు (61)ఎండలకు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందారు. యాదాద్రి భువనగిరి(D) మోత్కూరు(M) అనాజిపురంకు చెందిన తాపీ మేస్త్రీ ఉప్పల రామచంద్రయ్య (72), ఖమ్మం(D) తల్లాడ(M) రామచంద్రాపురంలో తొర్లపాటి దాసు (80), పెనుబల్లి(M) కొత్తకారాయిగూడేనికి చెందిన ఉల్లాస వెంకటేశ్వరరావు (60) వడదెబ్బతో ప్రాణాలు వదిలారు.