AP: పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు చనిపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.