ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి (వీడియో)

58చూసినవారు
TG: రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆత్మకూరు(s) మండలం నెమ్మికల్లు దండు మైసమ్మ దేవాలయం వద్ద జరిగింది. సూర్యాపేట జిల్లా కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి చెందిన మోక్షిత్(4)  బంధువుల శుభకార్యానికి కుటుంబ సభ్యులతో వచ్చాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టి బాలుడి పైనుంచి వెళ్లింది. దీంతో మోక్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

సంబంధిత పోస్ట్