నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి చెందారు. బాసరలో పుణ్యస్నానాలకు దిగి లోతైన ప్రదేశంలో మునిగి చనిపోయారు. గోదావరి మొదటి ఘాట్‌కు చేరుకున్న అంబులెన్స్‌లో మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారిలో మరొకరు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.