జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ రాష్ట్రంలోని మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించనుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక భారం తగ్గడమే గాక.. వారి జీవన విధానానికి మరింత సౌలభ్యం చేకూరనుంది. కాగా, మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.