తెలంగాణలో రేపటి నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. తొలి విడతగా తొమ్మిది జిల్లాలు- హనుమకొండ, WGL, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, KMM, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాలలో చేపపిల్లల పంపిణీని ప్రారంభిస్తారు. రెండో విడతలో మిగిలిన జిల్లాల్లో ఈ నెల 7నుంచి పంపిణీ చేయనున్నారు. చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఊరూరా పండగలా చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.