హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నిమ్స్ లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. SHARE IT>>