దేశంలో ఉచిత రేషన్ అనర్హుల ఏరివేతకు కేంద్ర ఐటీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY) లబ్ధిదారుల్లో అనర్హుల తొలగింపునకు చర్యలు చేపట్టింది. అనర్హుల గుర్తింపునకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని సంబంధిత శాఖతో పంచుకోనున్నట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. కాగా, PMGKAY కింద పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే.