AP: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్రైవేటు ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తున్న క్రమంలో భక్తులకు ఉపశమనం కలిగించడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఇకపై తిరుమలలో భక్తులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వీలుని కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ శ్యామల రావు తాజాగా వెల్లడించారు. భక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.