గుజరాత్‌లోని దాహోద్ జిల్లా సంజెలి గ్రామానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అత్తింటి వేధింపులతో బాధ పడుతోంది. ఏం చేస్తున్నా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోకపోవడంతో చివరికి అర్ధనగ్నంగా బయటకు పంపించేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగా వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం సదరు మహిళ గౌరవప్రదంగా జీవించేందుకు సొంత డబ్బులతో పండ్ల దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆమెకు అందించారు.