ఇకపై ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. గతంలో దంతేరస్ రోజున ఆయుర్వేద దినోత్సవం జరిపేవారు. కానీ దంతేరస్ తేదీ మారిపోతుండటంతో, స్థిరంగా సెప్టెంబర్ 23ను ఎన్నుకున్నారు. ఈ రోజు పగలు, రాత్రి సమంగా ఉండే ఈక్వినాక్స్ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.