పైనాపిల్ గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే వాడిపోయిన ముఖం తాజాగా మారుతుంది. మామిడి పండులోని విటమిన్ ‘సి’ బీటా కెరొటిన్ యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మామిడి గుజ్జులో కొద్దిగా పాలు కలిపి ఫేస్‌ప్యాక్ చేసుకోవచ్చు. బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు, మచ్చలు తొలగిపోతాయి. కివీలోని విటమిన్ ‘సి’ కొలాజన్ ఉత్పత్తిని పెంచి, నల్లమచ్చల్ని తగ్గిస్తుంది.