తెలంగాణలో చలివేంద్రాలకు నిధులు విడుదల

78చూసినవారు
తెలంగాణలో చలివేంద్రాలకు నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన 8,090 చలివేంద్రాల నిర్వహణకు నిధులివ్వాలని ఆదేశించింది. మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామపంచాయతీల్లో చలివేంద్రాలను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అత్యవసర తాగునీటి అవసరాలను తీర్చేందుకు జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన రూ.కోటి ప్రత్యేక నిధుల నుంచి చలివేంద్రాలకు అవసరమైన డబ్బులు తక్షణమే ఇవ్వాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్