వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫంగస్ పెరగడానికి దోహదపడుతుంది. ఇంకా తడి బట్టలు ఎక్కువసేపు ధరించడం వల్ల చర్మంపై ఫంగస్ వృద్ధి చెందుతుంది. చెమట, తేమ కలిసి ఫంగస్‌కు మరింత సౌకర్యం కల్పిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గి.. ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. పొడి బట్టలు, శుభ్రతతో ఈ సమస్యలను తగ్గించవచ్చు.