తక్కువ తేమ ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందవు. కావున విత్తనాలను 10-12 శాతం తేమ ఉండేంత వరకు ఆరబెట్టాలి. ఎలుకలు ఉంటే శిలీంధ్రాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. విత్తనాలు నాణ్యతను కోల్పోతాయి. ఇలాంటి గింజల్లోకి శిలీంధ్రాలు సులభంగా ప్రవేశిస్తాయి. కావున విత్తన నిల్వ సమయంలో ఎలుకలు లేకుండా జాగ్రత్తపడాలి. విత్తన నిల్వలో శిలీంధ్రాలను అదుపులో ఉంచడానికి కాప్టాన్ 2.5 గ్రా ఒక కిలో విత్తనానికి కలుపుకోవాలి.