గచ్చిబౌలి కాల్పుల కేసు.. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు

55చూసినవారు
గచ్చిబౌలి కాల్పుల కేసు.. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కలకలం సృష్టించిన కాల్పుల ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ అలియాస్‌ రాహుల్‌రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీఎస్‌, ఎస్‌వోటీ క్రైమ్‌ బృందాలు అతడి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే నిందితుడి నుంచి 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బిహార్‌ నుంచి కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్