తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ పురస్కారాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రెస్‌మీట్ నిర్వహించారు. '14 ఏళ్ల తర్వాత జరగనున్న అవార్డుల వేడుకను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎఫ్‌డీసీతో పాటు ఇండస్ట్రీకీ ఉంది. జూన్ 4న జరిగే ఈ ఈవెంట్ 'ఐ& పీఆర్' ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. 2014 నుంచి 2023 వరకు బెస్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా నలుగురికి అవార్డులు ఇవ్వనుండటం తొలిసారి' అని తెలిపారు.