TG: గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు శనివారం HYDహైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్-4లో జరగనున్నాయి. ఈ వేడుకలకు CM రేవంత్, మంత్రులతో సహా ప్రముఖులు హజరుకానున్నారు. 2014-2023 వరకు ఎన్నికైన ఒక్కో ఉత్తమ చిత్రానికి ఉత్తమ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లు మొత్తం 4 అవార్డులు అందుకోనున్నారు. ఇక 2024కు సంబంధించి అన్ని కేటగిరీలకు చెందిన అవార్డులు ఉండనున్నాయి. 14 ఏళ్ల తర్వాత గద్దర్ అవార్డులు ఇవ్వడం గమనార్హం.