తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక శనివారం విజయవంతమైందని ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఆ విషయంలో తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు సూచించారు. "వేడుకలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం చేతుల మీదుగా అవార్డులను అందుకున్న వారంతా చాలా ఆనందంగా ఉన్నారు." అని దిల్ రాజు అన్నారు.