TG: జూన్ 14న హైదరాబాద్‌లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ప్రకటించారు. 2014-2023 మధ్య విడుదలైన ఉత్తమ తెలుగు, ఉర్దూ చిత్రాలకు అవార్డులు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్‌గా సినీ నటి జయసుధను నియమించారు. దాదాపు 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు.