అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలపై కేసు నమోదు

65చూసినవారు
అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలపై కేసు నమోదు
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలోని ధారారం గ్రామ శివారులో అనుమతి లేకుండా నీటిపారుదల శాఖకు చెందిన నల్ల మట్టిని తరలిస్తున్న నాలుగు వాహనాలపై, నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఎస్ఐ జగన్ మోహన్ తెలిపారు. వాహనాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్