నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని ధారారం గ్రామంలో శుక్రవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శిశువులకు తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ గిరిజ, అంగన్వాడీ టీచర్లు స్వరూప, తిరుపతమ్మ, సుజాత, స్కూల్ టీచర్ ప్రత్యూష, ఏఎన్ఎం యదాబాయి, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.