నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ ముందు శుక్రవారం ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలో డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ల చేయటంతో మెడికల్ కాలేజీలో, ఆస్పత్రిలో వైద్య సేవలు చాలాసేపు నిలిచిపోయాయి.