అచ్చంపేట: మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు. శుక్రవారం చారకొండ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల ప్రజలు స్వాగతించాల్సిన విషయమన్నారు.