తెలంగాణ ప్రభుత్వం సావిత్రి బాయి పూలే సేవలకు గుర్తింపునివ్వడం పట్ల ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ అంబేద్కర్ స్మారక గ్రంథాలయంలో జ్యోతిభా బాయి పూలే 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీ భీముడు, ప్రజాసంఘాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రి బాయి జయంతి సందర్భంగా ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించడం ఆనందదాయకమన్నారు.