గద్వాల జిల్లా. ఐజ మండలం ఏ క్లాస్ పురం గ్రామంలో ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన రక్తపింజర ఎడమ చేతి బొటనవేలుపై కాటు వేసింది. ఆ వ్యక్తి కాటేసిన పామును మెడలో వేసుకుని ఆస్పత్రికి వచ్చిన ఘటన వైరల్ గా మారింది. విషపూరిత పాము కాటుకు గురైన ఓ వ్యక్తి చేసిన పనికి వైద్యులతోపాటు రోగులను భయాందోళనకు గురిచేసింది. తనను ఏ పాము కాటు వేసిందో వైద్యులకు చూపేందుకు ఆ సర్పాన్ని ఆ వ్యక్తి ఆస్పత్రికి తీసుకురావడం కలకలం రేపింది.