ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలోని ఓ కాలనీ వర్షపు నీటితో నిండి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్నిసార్లు వార్తల్లో వచ్చినా అధికారుల స్పందన లేదు. కాలనీలోకి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమై ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దోమల వల్ల రాత్రిళ్లు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.