జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం, జిల్లెలపాడు గ్రామ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున సోమవారం ఉదయం మొసలి కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన కలిగింది. మేకల కాపరుడు శివనాయుడు తన మేకలను తీసుకొని నది ఒడ్డుకు వెళ్లగా మొసలి కనిపించిందని తెలియజేశారు. అధికారులు ఈ విషయంపై స్పందించి ప్రజలను, ముఖ్యంగా మత్స్యకారులు, పశువుల కాపరులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొసలిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.