అలంపూర్: పాఠశాలలో వస్తువులను ధ్వంసం చేసిన దుండగులు

79చూసినవారు
పాఠశాలలో వస్తువులను ధ్వంసం చేసిన ఘటన ఐజ మండలం బింగిదొడ్డి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలకు దసరా హాలిడేస్ కావడంతో ఇదే అదనుగా భావించిన దుండగులు పాఠశాల వస్తువులను ధ్వంసం చేశారు. మంగళవారం స్కూల్ ప్రారంభించడంతో స్కూల్ కి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్లు, కిటికీలు, కరెంటు బోర్డును ధ్వంసం చేసి ఉన్నాయి. ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్