గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్ఎస్ కంపెనీ నాలుగైదు గ్రామాల ప్రజలకు, మూగజీవాలకు ప్రాణాంతకంగా మారింది. కంపెనీ నుండి వెలువడే విష రసాయనాలను ధ్వసం చేయకుండా పంటపొలాలపై, ఆపై కృష్ణానదిలోకి విష రసాయనాలను వదులుతున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ నీటిని తాగిన మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయని, ఇంటి తలుపులు మూసుకున్నా భరించరాని దుర్గంధం వెలువడుతుందన్నారు.