జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రసాద్ స్కీం కింద నిర్మించిన అన్నదానం సత్రం బ్లాక్ నిర్మాణం పూర్తయింది. ఈ బ్లాక్‌ను టూరిజం శాఖ డిప్యూటీ ఇంజనీర్ పరుష వేది బుధవారం ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ కొత్త అన్నదానం సత్రం బ్లాక్ ద్వారా భక్తులకు మరింత సౌకర్యవంతంగా అన్నదానం అందించే అవకాశం ఏర్పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.