కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర

59చూసినవారు
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర
రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్యతో పాటు వైద్యం కూడా దూరం చేయాలనే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. గ్రామాలలో పేదలకు వైద్యం అందించేందుకు నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. గురువారం ఆయన ఐజ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైద్య విధానంలో కీలకంగా పనిచేసే వైద్య విధాన పరిషత్తును రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కుట్రలు పడుతుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.