గద్వాల నియోజకవర్గం గట్టు, దరూరు, మల్దకల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని గ్రామ దేవతలను శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దర్శించుకొని ఘనంగా పూజలు నిర్వహించారు. గట్టు మండలంలోని ఇందుహిసి గ్రామంలోని గ్రామదేవత ఇంజమ్మ అవ్వ దేవర సందర్భంగా అమ్మవారిని దేవాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందారు.