గురువారం వాల్మీకి జయంతి సందర్భంగా గద్వాల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్ లో ఏర్పాటుచేసిన వాల్మీకి జయంతి వేడుకల్లో భాగంగా శారద స్కూల్ కరెస్పాండెంట్ బాబు నాయుడు కుమారుడు సాయి చరణ్ ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా బాసు హనుమంతు నాయుడు శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైండింగ్ రాములు, మురళీ, పచ్చర్ల శ్రీనివాసులు, రాజు నాయుడు, రాము నాయుడు, వీరేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.