గద్వాల: పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే

52చూసినవారు
గద్వాల: పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని లింగాపురం గ్రామానికి చెందిన వడ్డే కేశన్న అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. మంగళవారం విషయం తెలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి స్వగృహం చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి, నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ విజయ్, మాజీ ఎంపీటీసీ ఆనంద్ గౌడు, నాయకులు మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్