గద్వాల జిల్లా ఐయిజ మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వెనుకబడిన కులాల్లో పుట్టి బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, అంటరాని వారికి అనేకమైన సేవలుచేసి, అంటరానితనం విడనాడాలని ఇతర కులాలను చిన్నచూపుతో చూడకూడదని అగ్రవర్ణాలతో ఆనాడే విభేదించారని అన్నారు.