వాల్మీకి జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ పరిధిలోని గోనుపాడు, ధరూర్, రంగాపురం, గువ్వల దీన్నే, నందిన్నె గ్రామాలలోని వాల్మీకి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి జయంతి వేడుకలలో బాసు హనుమంతు నాయుడు పాల్గొని వాల్మీకి మహర్షికి పూల మాల వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా బాసు హనుమంతు నాయుడు కి వివిధ గ్రామాల వాల్మీకి సంఘం నాయకులు గురువారం శాలువతో ఘనంగా సన్మానించారు.