రైతులు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేసుకోవాలని మండల పశువైద్యురాలు డా. స్వరూప రాణి తెలిపారు. పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లేడు దిన్నె గ్రామంలో 133 పశువులకు లంఫి స్కిన్ నివారణ టీకాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్ధిక, పశువుల అభివృద్ధి కోసం ఉచితంగా పశువులకు టీకాలు సరఫరా చేస్తోందని తెలిపారు. గ్రామాల్లో టీకాల కార్యక్రమాలు కొనసాగుతాయని, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.