అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని ముండ్లదిన్నే గ్రామానికి చెందిన శిరీష ఆపరేషన్ కొరకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 1, 50, 000 ఎల్వోసీ కాపీని శనివారం ఎమ్మెల్యే విజయుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శేషిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నీలప్ప, పుల్లూరు రఘురెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.