మనోపాడు మండలం చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన ఎస్తేరమ్మ 10వ తేదీ బజ్జీల బండి దగ్గర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఘర్షణ పడడంతో వేడిగా ఉన్న నూనె ఎస్తేరమ్మ పై పడింది. కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న దళిత మహిళా ప్రశాంతమ్మ (ఎస్తేరమ్మ) ను బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ప్రేమలత పల్లయ్య మంగళవారం పరామర్శించి మనోధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.