మహబూబ్ నగర్: ప్రాణాలు కాపాడిన పోలీసులు
మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ సోనా సుందర్ ఆత్మహత్య చేసుకునేందుకు సోమవారం పాలీటెక్నిక్ కాలేజీ వద్ద రైల్వే ట్రాక్ పై వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వేగంగా స్పందించిన పీసీ ఐటీ సెల్ ప్రవీణ్ ద్వారా అతని ఫోన్ లొకేషన్ వచ్చింది. రెండవ పట్టణ పోలీసులు ఐటీ సెల్ పీసీ ప్రవీణ్, పీసీ మురళి అతడిని సురక్షితంగా పట్టుకుని ప్రాణాలను కాపాడారు. కౌన్సెలింగ్ అనంతరం భార్య, స్నేహితులకు అప్పగించారు.