జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లు వేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. పత్తి, మిరప, కంది పంటలకు ఈ వర్షంతో కొంతవరకు మీరు జరుగుతుందని రైతులు తెలిపారు. కాగా వర్షంతో పాఠశాల నుండి ఇంటికి వెళ్లే విద్యార్థులు, పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.