జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్ జరగబోయే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధి ఎ. పి. జితేందర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా జమ్మిచేడు దగ్గర ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, మున్సిపల్ చైర్మన్ బి. యస్. కేశవ్ వారికి పూలమొక్క, పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు.