అయిజలో దారుణం

67చూసినవారు
అయిజలో దారుణం
గద్వాల జిల్లా అయిజలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కొత్త బస్టాండ్ దగ్గర నర్సప్ప గుడి పక్కన చేనేత కార్మికుడు నేష మాస్ (19) నివాసం ఉంటున్నాడు. వారి ఇంట్లోకి దూరి బాషా అనే వ్యక్తి ప్రవేశించి యువకుడిని దారుణంగా కత్తితో పొడిచాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్