గద్వాలలోని ఎంపీ యుపిఎస్ తుమ్మలచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థినిలు, బతుకమ్మలను తయారుచేసి ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని ఉపాధ్యాయుడు మాకం బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో, కోలాటం, పాటలతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.