జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మార్కెట్ యార్డ్ లోని రైతు వేదికలో ఈనెల 16న భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ జ్యోతి శనివారం తెలిపారు. ప్రభుత్వం భూ సంబంధ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకు వచ్చిందన్నారు. మండల కేంద్రం రైతులు భూ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకొని పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం 9: 00 నుంచి సాయంత్రం 4: 00 వరకు సదస్సు ఉంటుందన్నారు. ఈనెల 16తో రెవెన్యూ సదస్సులు ముగుస్తాయన్నారు.