జోగులాంబ సన్నిధిలో రాష్ట్ర సీఎం సోదరుడు జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనానికి వచ్చిన జగదీశ్వర్ కి ఆలయ చైర్మన్, ఈవో, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.