సీడ్ కంపెనీలకు గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు అమ్ముడు పోయారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్ ఆరోపించారు. శనివారం రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లాకు వచ్చిన క్రమంలో సీడ్ పత్తి రైతుల సమస్యలను విన్నవించడానికి వెళ్లిన విజయ్‌కుమార్‌ను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి ధరూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం అన్నారు.